రాయలసీమ సమగ్రాభివృద్ది సంస్థ

​​
To empower people with technology, finance,IT, Training, Infrastructure, World class Education ,Research&Development and connectivity

​                                   Learn More »

                                                                            రాయలసీమ ఆత్మగౌరవ దినోత్సవం
                                                                       
                                                                        (రాయలసీమ నామకరణం జరిగిన రోజు) 

విజయనగర సామ్రాజ్యం లో రతనాల సీమగా వెలిగిన రాయలసీమ రాక్షసి-తంగడి యుద్ధం తరువాత తన ప్రభావం కోల్పోతూ వచ్చింది. బహమనీలు, మొఘల్లు, మరాఠా లు, టిప్పు సుల్తాన్ ల సైన్యపు క్రమ దాడులతో మన సీమ ఎప్పుడూ నిమ్మలంగా వుండేది కాదు. ఇలా చివరకు నిజాం రాజ్యం లో వుంటూ రాజు నిర్లక్ష్యానికి గురై, అప్పుడు వున్న పాలేగళ్ళ పాలన లో సతమతం అవుతూ వుండేవారు. నిజాం రాజ్యంకి మరాఠా, టిప్పు సేనల నుంచి ప్రమాదం వున్న పరిస్థితులలో బ్రిటిష్ సైన్య సహకారం కోసం మన సీమ జిల్లాలను దత్తు(ceded)గా ఇచ్చేసాడు.వేరే సాయం ఇస్తున్న కారణంగా వచ్చిన ప్రదేశాన్ని ఆ సాయం కోసం ఖర్చు అయిన వ్యయానికి పదింతలు మన కరువు సీమ నుంచే వసులు చేసారు బ్రిటిష్ వారు. ఇలా దాడులు మరియు రాజుల ఆటలో విసిరి వేయబడ్డ మన సీమ "దత్తు" అనే పిలుపుతో ఆత్మ విశ్వాసం దెబ్బతినేలా వుండేది.
ఇలా వుంటే, 1928 నవంబరు 17,18 తేదీలన నంద్యాల పట్టణంలో "ఆంధ్రమహాసభ" సభలు జరిగాయి. ఈ రెండు రోజుల సభలలొ 17 న ఆంధ్రరాష్టీయసభ , ఆంధ్రమహాజనసభ, ఆంధ్ర సర్వపక్ష సమావేశసభలు జరిగాయి. 18 న ఉదయం "ప్రథమ దత్తమండల సమావేశం" ప్రారంభమయింది. ఈ సభకు   కె. శరభారెడ్డి సభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కాగా, .కడప కోటిరెడ్డి అధ్యక్షతన కొనసాగింది. ఈ సభలో అనేక రాయలసీమ సమస్యలు చర్చకు వచ్చాయి. ఇదే సందర్భంలో  చిలుకూరి నారాయణరావు (అనంతపురం కాలేజి అధ్యాపకులు, శ్రీకాకులం వాసి) ఈ ప్రాంతానికి దత్తమండలం బదులు, "రాయలసీమ" అని ఉంటే బాగుంటాదని ప్రతిపాదించాడు. నిజానికి చిలుకూరి వారు1928 సెప్టెంబర్ 8 నాడే "దత్త" అనే గేయం రాసి కాలేజి మ్యాగజైన్ లో ప్రచురించాడు. ఈ ప్రాంతం దత్త కాదని...చాలా గొప్పదని ఆ గేయంలో తెలిపాడు.  చరిత్రలో  రాయలసీమ అనే పదప్రయోగం మట్ల అనంత భూపాలుడి ఆస్థానంలో వెలువడిన "అభిషిక్తరాఘవీయం" కావ్యం లో కనిపిస్తుంది.   చిలుకూరు వారు రాయలసీమ పేరు పై స్పష్టంగా తన ఆలోచనలు నంద్యాలలో తెలియచేశాడు. ఈ ప్రాంత ఆత్మగౌరవానికీ ప్రతీకగా రాయలసీమ పేరును సీమవాసులందరు ఏకగ్రీవంగా ఆమోదించారు.  ఈ పేరునే పప్పూరు రామచార్యులతో పాటు,  మిగతా సీమ నాయకులు వ్యాప్తి లోకి తీసుకొచ్చారు. దత్తమండలం నుండి రాయసీమ గా మారిన ఆ దినాన్ని "రాయలసీమ ఆత్మగౌరవదినం"గా బావిద్దాం.

Vision

Mission

Our vision is to make Rayalaseema empowered to fight and overcome Drought, Unemployment, Human trafficking, Fluoride, Poor infrastructure etc... 
Learn More »

నగదు రహిత భారతం ​

FIRE తమ బాధ్యత గా నగదురహిత సమాజాన్ని ఏర్పాటు చెయ్యడం కోసం ​కృషి చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలలో చైతన్యం పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టింది. 
మిగతా వివరాలకు  »
CALL US  1800 599 8888

FORUM FOR INTEGRATED RAYALASEEMA EMPOWERMENTF I R E